• facebook
  • whatsapp
  • telegram

Group-4 : గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా విడుదల

* ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచినట్లు పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. తిరస్కరణకు గురైన వారి  వివరాలను జీఆర్‌ఎల్‌లో పొందుపరచలేదని స్పష్టం చేసింది. మొత్తం 300 మార్కులకు అత్యధికంగా 220.458 మార్కులతో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన అభ్యర్థి ప్రథమస్థానంలో నిలిచారు. రాష్ట్రంలో గ్రూప్‌-4 సర్వీసు ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబరు 1న ఉద్యోగ ప్రకటన (19/2022) జారీ చేసింది. ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2023 జులై 1న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌-1, 2 రాతపరీక్షలకు దాదాపు 7.6 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన తుదికీ అక్టోబరు 6న టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పేపర్‌-1లో ఏడు, పేపర్‌-2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుది కీ ఆధారంగా అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్‌ పూర్తిచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్‌ కేటాయించకుండా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నియామక సంస్థలకు తెలిపింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్‌పీఎస్సీ జీఆర్‌ఎల్‌ను ప్రకటించింది.

ఫిజియోథెరపిస్టు పోస్టులకు 48 మంది ఎంపిక

వైద్యవిధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఎంపికైన 48 మందితో తుదిజాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జోన్‌-5 కింద 17 మంది, జోన్‌-6లో 31 మంది పోస్టులకు ఎంపికయ్యారు.


 ఫలితాల  కోసం క్లిక్ చేయండి  





 

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - IV  


 పేపర్ - I - జనరల్ స్టడీస్  
 

1.  కరెంట్ అఫైర్స్
2.  అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3.  నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం
4.  పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
5.  భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం
6.  భారత రాజ్యాంగం: ముఖ్య లక్షణాలు
7  భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8  భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
9  తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
10  తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
11  తెలంగాణ రాష్ట్ర విధానాలు

  పేపర్ - II-సెక్రటేరియల్ ఎబిలిటీస్ 
 

1.  మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)

2.  లాజికల్ రీజనింగ్
3.  కాంప్రహెన్షన
4.  వాక్యాల వరుస క్రమం (ప్యాసేజ్ను మెరుగ్గా విశ్లేషణ చేయడం)
5.  సంఖ్యా, అంకగణిత సామర్థ్యాలు


   ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు  


  ♦ నమూనా ప్రశ్నపత్రాలు  


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా! 

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.