• facebook
  • whatsapp
  • telegram

TS Public Schools: అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

* వాటికి, వర్సిటీలకు చెరో రూ.500 కోట్లు

* విద్యారంగానికి రూ.21,389 కోట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖకు బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. 2023-24లో రూ.19,093 కోట్ల నిధులను ఇవ్వగా... ఈ ఏడాది అవి రూ.21,389 కోట్లకు పెరిగాయి. ఇందులో పాఠశాల విద్యకు 17,931.42 కోట్లు, ఉన్నత విద్యకు 2,959.10 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లు కేటాయించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద 2024-25 విద్యాసంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లను వెచ్చిస్తామని, మండలానికో పాఠశాల చొప్పున ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఉస్మానియా సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలకోసం మరో రూ.500 కోట్లను కేటాయించింది.

* ఐటీఐల నవీకరణ

రాష్ట్ర సాంకేతిక విద్యను పటిష్ఠం చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికిగాను రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అధికారుల బృందాలతో అధ్యయనం చేయించి ప్రణాళికను రూపొందిస్తామని తెలిపింది. అన్ని ప్రభుత్వ ఐటీఐలకు కొత్త సాంకేతిక పరికరాలు అందించడం, ఐటీఐ సీట్ల పెంపు, శిక్షణ పొందిన విద్యార్థులు వందశాతం ఉద్యోగాలు పొందేలా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది.

* నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు

నైపుణ్య విశ్వవిద్యాలయా(స్కిల్‌ యూనివర్సిటీ)లను ఏర్పాటు చేసి, రాష్ట్ర అధికారుల అధ్యయన బృందం సూచించిన అత్యున్నత విధానాలను ఆ వర్సిటీల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు బోధనరుసుము, ఉపకారవేతనాలు సకాలంలో అందిస్తామని ప్రకటించింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అణు శక్తి కేంద్రంలో ఉద్యోగావకాశాలు

‣ కోర్టులో క్లర్క్‌ కొలువులు

‣ నవరత్న కంపెనీలో అవకాశాలు

‣ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.