• facebook
  • whatsapp
  • telegram

DSC: తెదేపా అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌  

ఇచ్ఛాపురం: రానున్న ఎన్నికల్లో విజయం తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైకాపా హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయన్నారు. స్కూల్‌ రేషనలైజేషన్‌ పేరుతో పోస్టులు తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం’’ అని చెప్పారు.




మరింత సమాచారం... మీ కోసం!

‣ అణు శక్తి కేంద్రంలో ఉద్యోగావకాశాలు

‣ కోర్టులో క్లర్క్‌ కొలువులు

‣ నవరత్న కంపెనీలో అవకాశాలు

‣ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.