• facebook
  • whatsapp
  • telegram

TSPSC: 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

‣ ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 


హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ (Group 1 Notification 2024 Telangana) విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష; సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10గంటల నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరిచేసుకోవచ్చు. పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు నుంచి హాల్‌టిక్కెట్లు అందుబాటులోకి తెస్తారు.


పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే... 

‣ డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు): వయస్సు 18 నుంచి 46 ఏళ్లు - వేతనం రూ.58,850 - రూ.1,37,050

‣ డీఎస్పీ (115 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.58,850 -రూ.1,37,050

‣ సీటీవో (48 పోస్టులు): 18 - 46ఏళ్లు - వేతనం రూ.58, 850 -రూ.1,37,050

‣ ఆర్టీవో (4 పోస్టులు): 21 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా రిజిస్ట్రార్‌ (6 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు): 18 - 35 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (30 పోస్టులు): 21 - 35 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు (3 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54, 220 -రూ.1,33,630

‣ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (2 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.54,220 -రూ.1,33,630

‣ జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ (20 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (38 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌  (41 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310

‣ ఎంపీడీవో  (140 పోస్టులు): 18 - 46 ఏళ్లు - వేతనం రూ.51,320 -రూ.1,27,310


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి...



  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10.తెలంగాణ రాష్ట్ర విధానాలు
11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్



  ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   



   నమూనా ప్రశ్నపత్రాలు   




మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.