• facebook
  • whatsapp
  • telegram

Mega Job Mela: 100 కంపెనీలు.. 5 వేల ఉద్యోగాలు 

* ఫిబ్రవరి 26న మెగా జాబ్‌మేళా

* టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అవకాశం

   

నల్గొండ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరిచందన వెల్లడించారు. 100కి పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఫిబ్రవరి 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్‌ మేళా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సెల్‌ (TFMC), తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (TASK) సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్‌లను తీసుకొని రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.