• facebook
  • whatsapp
  • telegram

Education: 2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

విధివిధానాలపై సీబీఎస్‌ఈని కసరత్తు ప్రారంభించాలన్న కేంద్రం


దిల్లీ: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సెమిస్టర్‌ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్‌ఈని కోరింది. దీంతో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహించే అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ, సీబీఎస్‌ఈ ప్రతినిధులు మే నెలలో సంప్రదింపులు జరపనున్నట్లు వెల్లడించారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని గతేడాది కేంద్ర విద్యాశాఖ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

Updated Date : 27-04-2024 12:04:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం