• facebook
  • whatsapp
  • telegram

Entrance Exam: 26న గీతం ప్రవేశ పరీక్ష గ్యాట్‌


విశాఖపట్నం (సాగర్‌నగర్‌), న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, సైన్స్, లా, నర్సింగ్, పారామెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష గీతం అడ్మిషన్‌ టెస్ట్‌ (గ్యాట్‌-2024)ను మే 26న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డి.గుణశేఖరన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, క్రీడల్లో ప్రతిభ చాటే వారికి గీతం ప్రవేశాల్లో ప్రాధాన్యమిచ్చి, ఉపకారవేతనాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచి ఉద్యోగ, విదేశీ విద్యావకాశాలను పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన శిక్షణ అందించేందుకు గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లు రిజిస్ట్రార్‌ వెల్లడించారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.