• facebook
  • whatsapp
  • telegram

Inter Practicals: అధికారులు లేకుండానే ప్రయోగ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు డిపార్ట్‌మెంటల్‌ అధికారులు లేకుండానే జరగనున్నాయి. సాధారణంగా ప్రాక్టికల్స్‌కు ఇతర కళాశాల అధ్యాపకుణ్ని ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా నియమిస్తారు. ఆయనతోపాటు ఇంటర్‌బోర్డు తరఫున ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులను కూడా పర్యవేక్షణ నిమిత్తం డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా నియమిస్తారు. ఈసారి ప్రయోగ పరీక్షలు ఈనెల 23న ప్రారంభం కానున్నాయి. వాటికి డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఉండరు. కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి. ఈక్రమంలో దాదాపు 15 రోజులపాటు అధ్యాపకులను డిపార్ట్‌మెంట్‌ అధికారులుగా నియమించడం వల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, ఈసారి కూడా ఎంసెట్‌లో వెయిటేజీ లేనందున ప్రాక్టికల్‌ మార్కులు అంత ముఖ్యం కాదని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 2 వేల కళాశాలల్లో మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.