• facebook
  • whatsapp
  • telegram

ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా ఉపకార వేతనాలు 

ఈనాడు, దిల్లీ: ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా ఉండే 60% శాతం సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమకానుంది. డిసెంబ‌రు 23న జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అయిదేళ్లలో ఈ పథకం కింద 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ మంత్రి తావర్‌ చంద్‌ గహ్లోత్‌, ఆ శాఖ కార్యదర్శి రెడ్డిసుబ్రహ్మణ్యం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.59,048 కోట్లు వ్యయం చేయనున్నారు. అందులో 60% వాటా కింద కేంద్రం రూ.35,534 కోట్లు ఇవ్వనుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి ఆపైన ఏ ఉన్నత విద్య కోర్సు ఎంచుకున్నప్పటికీ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, నెలవారీ నిర్వహణ భత్యాలను ఈ స్కాలర్‌షిప్‌ కింద అందిస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.