జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వీఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కోర్సులో ఉచిత శిక్షణకు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు డిసెంబరు 29న ఓ ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ, యువకులు డిసెంబరు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు బాలానంద కేంద్రం, 2/2, బ్రాడీపేట, గుంటూరు చిరునామాలో సంప్రదించాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్తో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తారని వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.