• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్‌లో పాఠశాలలు తెరవాలి

* 69 శాతం తల్లిదండ్రుల అభిప్రాయం
* తాజా సర్వేలో వెల్లడి

దిల్లీ: కొవిడ్‌-19 తీవ్రత, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌లోనే పాఠశాలలు తెరవాలని 69 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. 19 శాతం మాత్రమే జనవరిలో తెరవాలంటున్నారు. టీకా విషయంలోనూ తల్లిదండ్రులు తొందరపడడం లేదు. కేవలం 26 శాతం మంది మాత్రమే ఏప్రిల్‌కల్లా తమ పిల్లలకు టీకా వేయించాలనుకుంటున్నారు. 56 శాతం మంది మాత్రం వేచి చూద్దామని ధోరణిలో ఉన్నారు. టీకా డేటా, సమర్థతకు సంబంధించిన ఇతర వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే టీకా విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 19000 మంది తల్లిదండ్రులపై  ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే ఆన్‌లైన్‌ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.