• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉష్ణ‌ప్ర‌సారం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. వేడిగా ఉన్న వస్తువు ఉష్ణవికిరణ శక్తి వ్యాప్తి ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జ: వేడిగా ఉన్న వస్తువు ఉష్ణవికిరణ శక్తి వ్యాప్తి ఆ వస్తువు ఉష్ణోగ్రత, పదార్థం, ఆకారం, పరిమాణం, ఉపరితల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.


2. ఒక కృష్ణవస్తువు ఉష్ణోగ్రతలు T, 4T లకు సంబంధించిన గరిష్ఠ ఉద్గార సామర్థ్యాల తరంగదైర్ఘ్యాలను పోల్చండి.
జ: వీన్స్ నియమం ప్రకారం కృష్ణవస్తువు
λmT = స్థిరాంకం

                                
                                      
3. పరావర్తకత ఎక్కువగా ఉన్న వస్తువు ఉద్గారత అతి తక్కువ. ఎందుకు?
జ: కిర్కాఫ్ నియమం ప్రకారం ఒక ఉత్తమ ఉద్గారకం, ఉత్తమ శోషకం. పరావర్తకత ఎక్కువగా ఉన్న వస్తువు ఉష్ణవికిరణ శక్తిని తక్కువగా శోషించుకుంటుంది. కాబట్టి పరావర్తకత ఎక్కువగా ఉన్న వస్తువు ఉద్గారత కూడా తక్కువగా ఉంటుంది.

4. 6000 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద సూర్యుడు ఒక కృష్ణవస్తువు అని అనుకుంటే, సూర్యకాంతిలోని ఏ తరంగదైర్ఘ్య ఉద్గార సామర్థ్యం గరిష్ఠంగా ఉంటుంది?
జ: వీన్స్ నియమం ప్రకారం  
λmT = స్థిరాకం. ఈ స్థిరాంక విలువ 2898 µmK; సూర్యుడి ఉష్ణోగ్రత T = 6000 K      
                              
      కాబట్టి 483 nm వద్ద సూర్యుడి ఉద్గార సామర్థ్యం గరిష్ఠంగా ఉంటుంది.


5. ఒక గదిలో ఉంచిన వేడి వస్తువు ఏ ప్రక్రియ ద్వారా ఆ ఉష్ణాన్ని పరిసరాలకు వ్యాపింపజేస్తుంది?
జ: ఉష్ణసంవహనం, ఉష్ణవికిరణాల ద్వారా. ఉష్ణవహనం ద్వారా వ్యాపించే ఉష్ణం అతి తక్కువ.


6. ఒకే పదార్థంతో తయారైన రెండు గోళాల పరిమాణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ రెండింటిని ఒకే ఉష్ణోగ్రత వరకు వేడిచేసి చల్లారిస్తే, వాటిలో ఏది త్వరగా చల్లారుతుంది?
జ: పరిమాణం పెద్దగా ఉండే గోళం. వైశాల్యం ఎక్కువగా ఉన్న వస్తువు ఉపరితలం నుంచి ఉష్ణవికిరణం ఎక్కువగా జరుగుతుంది.


7. ఒక వస్తువు చల్లారే రేటు ఏకరీతిగా ఉంటుందా?
జ: ఉండదు. వస్తువు ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు చేరువయ్యేకొద్దీ చల్లారే రేటు తగ్గుతుంది.

8. T, 2T ఉష్ణోగ్రతలున్న రెండు కృష్ణవస్తువుల వికిరణ సామర్థ్యాల నిష్పత్తి ఏక ఉపరితల వైశాల్యానికి ఎంత?

9. శూన్యం ద్వారా ఉష్ణశక్తి ఎంత వేగంతో పయనిస్తుంది?
జ: శూన్యం ద్వారా కాంతిశక్తి పయనించే వేగంతో, అంటే 3 × 108 ms-1.


10. ఉష్ణవాహక వస్తువులు అంటే ఏవి?
జ: ఉష్ణవికిరణాలను ప్రసారం చేసే వస్తువులను ఉష్ణవాహక వస్తువులు అంటారు.


11. ఉష్ణవికిరణాల స్వభావం ఏమిటి?
జ: ఉష్ణవికిరణాలు విద్యుదయస్కాంత తరంగాలు.


12. ఉత్తమ కృష్ణవస్తువు శోషణ సామర్థ్యమెంత?
జ: ఒకటి.


13. -200oC వద్ద ఉన్న వస్తువు శక్తిని వికిరణం చెందిస్తుందా లేదా శోషిస్తుందా?
జ: ఆ వస్తువు శక్తిని వికిరణం చెందించడమే కాకుండా అదే సమయంలో శక్తిని శోషిస్తుంది.


14. ఉత్తమ కృష్ణవస్తువుకు అతి దగ్గరగా ఉండే వస్తువుకు ఉదాహరణ ఇవ్వండి.
జ: ఒక కోటరంలో ఉండే చిన్న రంధ్రం చాలావరకు ఉత్తమ కృష్ణవస్తువుగా పనిచేస్తుంది.

15. కిర్కాఫ్ నియమానికి ఒక అనువర్తనాన్ని తెలపండి.
జ: సోడియం మూలకం వేడిగా ఉన్నపుడు పసుపు రంగును వెలువరించే ఒక మంచి ఉద్గారకంగా ప్రవర్తిస్తే, అదే సోడియం చల్లగా ఉన్నప్పుడు అదే రంగును శోషించే శోషకంగా ప్రవర్తిస్తుంది.

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌