• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS PECET: టీఎస్‌ పీఈసెట్‌-2024 

వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్‌ పీఈసెట్‌)- 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) విడుదల చేసింది. దీన్ని కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేట్‌/ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు.

పరీక్ష వివరాలు…

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ పీఈసెట్‌-2024)

కోర్సులు: బీపీఈడీ (రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు)

విద్యార్హత: బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01-07-2024 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు 01-07-2024 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 400 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి. 

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

* మార్చి 12: నోటిఫికేషన్‌ విడుదల

* మార్చి 14 నుంచి మే 15 వరకు: దరఖాస్తుల స్వీకరణ

* మే 16- 31 వరకు: రూ.500ల నుంచి రూ.2 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం

* జూన్‌ 10 నుంచి 13 వరకు: పరీక్షలో భాగంగా అభ్యర్థులకు కరీంనగర్‌లో క్రీడల పోటీల నిర్వహణ


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :