• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GDS POSTAL JOBS: పోస్టల్‌ శాఖలో 44,228 ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ప్రకటన వెలువడించింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 05 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: 

1. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

2. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)

3. డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228.

విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. 

ఎంపిక విధానం: అభ్యర్థులు  పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌- 1,355, తెలంగాణ- 981.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 15-07-2024.

దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024.

దరఖాస్తుల సవరణ తేదీలు: ఆగస్టు 06 నుంచి 08 వరకు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :