• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PJTSAU: జయశంకర్ వర్సిటీలో యూజీ ప్రోగ్రామ్‌ 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో కింది అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

డిగ్రీ ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:

1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌ (నాలుగేళ్లు): 842 సీట్లు

2. బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (నాలుగేళ్లు): 43 సీట్లు

3. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌(ఐదున్నరేళ్లు): 184 సీట్లు

4. బీఎఫ్‌ఎస్సీ(నాలుగేళ్లు): 39 సీట్లు

5. బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు): 234 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్)తో పాటు తెలంగాణ ఈఎపీసెట్‌-2024 ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: బీవీఎస్సీ ఏహెచ్‌ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్లు; ఇతర కోర్సులకు 17 నుంచి 22 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: తెలంగాణ ఈఎపీసెట్‌-2024లో అభ్యర్థులు పొందిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12-07-2024.

రిజిస్ట్రేషన్ చెల్లింపు చివరి తేదీ: 17-08-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 18-08-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 19-08-2024 నుంచి 19-08-2024 వరకు.
 

మరింత సమాచారం...మీ కోసం!  

 ‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :