• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RGNAU: ఆర్‌జీఎన్ఏయూలో వివిధ ప్రోగ్రాములు

భార‌త ప్ర‌భుత్వ పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (అమేథీ)లోని రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఏవియేష‌న్ యూనివ‌ర్సిటీ (ఆర్‌జీఎన్ఏయూ) 2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్ (పీజీడీఏఓ)- మొత్తం సీట్లు: 96

* జీఎంఎఆర్ ఏవియేష‌న్ అకాడ‌మీతో క‌లిసి ఈ ప్రోగ్రాం నిర్వ‌హిస్తారు. ఈ కోర్సు వ్య‌వ‌ధి-12 నెల‌లు క్లాస్ రూం ట్రెయినింగ్‌, 06 నెల‌లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇంట‌ర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ ఫ‌లితాల కోసం చూస్తున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 31.07.2022 నాటికి 25 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: గ్రాడ్యుయేష‌న్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

2) బ్యాచిల‌ర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్ (బీఎంఎస్‌) ఇన్ ఏవియేష‌న్ స‌ర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో

* లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో క‌లిసి ఈ ప్రోగ్రాం నిర్వ‌హిస్తారు. ఈ కోర్సు మూడు సంవ‌త్స‌రాల అప్రెంటిస్‌షిప్-ఎంబ‌డెడ్ డిగ్రీ ప్రోగ్రాం.

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో మ్యాథ‌మేటిక్స్‌/ కామర్స్‌ విభాగంలో ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 31.07.2022 నాటికి 21 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్మీడియ‌ట్‌ మార్కులు, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.06.2022.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: 29.07.2022

నోటిఫికేష‌న్: http://rgpgdao.org/pgdao.aspx
 

 

 

Some More Notifications

Teritorial Army - Officer Posts

BIS, New Delhi - 46 Young Professional Posts

IIT, Dhanbad - Junior Coaching Assistants

AIIMS, Jodhpur - 73 Faculty Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ ఇంటర్‌తో హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

Notification Information

Posted Date: 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :