• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GPAT: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌)-2024

జాతీయ స్థాయిలో ఫార్మసీలో పీజీ, పీహెచ్‌డీ చదువులకు గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) రాయడం తప్పనిసరి. ఇందులో మంచి ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలు/ సంస్థల్లో తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ), పీహెచ్‌డీ చదువుకోవటానికి వీలవుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్‌) నిర్వహించే జీప్యాట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలో ఫార్మసీ అనుబంధ యూనివర్సిటీలు/ కళాశాలలు/ సంస్థల్లో ఎంఫార్మసీ, పీహెచ్‌డీలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది.

పరీక్ష వివరాలు:

* గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) - 2024

అర్హత: ఇంటర్మీడియట్‌ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. బీఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌(ఫార్మాస్యూటికల్ అండ్‌ ఫైన్‌ కెమికల్‌ టెక్నాలజీ) తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు. 

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) తరహాలో అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నపత్రం 500 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆయా విభాగాలవారీ ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ- 38, ఫార్మాస్యూటిక్స్‌- 38, ఫార్మకాగ్నసీ- 10, ఫార్మకాలజీ- 28, ఇతర సబ్జెక్టులు- 11 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, హైదరాబాద్, కరీంనగర్.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 08-05-2024.

రుసుము చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 11-05-2024 నుంచి 14-05-2024 వరకు.

అడ్మిట్ కార్డుల జారీ: 03-06-2024.

పరీక్ష తేదీ: 08-06-2024.

ఫలితాల వెల్లడి: 08-07-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :