• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TGPSC RIMC: టీఎస్‌పీఎస్సీ- ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు 

భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ‌కు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జులై- 2025 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీజీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
ప్రకటన వివ‌రాలు..
* ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు జులై- 2025 టర్మ్‌
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2025 జులై 1 నాటికి ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఎడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 
వ‌య‌సు: 01.07.2025 నాటికి ప‌ద‌కొండున్నర ఏళ్లకు త‌గ్గకుండా ప‌ద‌మూడేళ్లకు మించ‌కుండా ఉండాలి. 02.07.2012 - 01.07.2014 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, వైవా వోస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక  ప్రక్రియ ఉంటుంది.
ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్షలో మొత్తం మూడు పేప‌ర్లు ఉంటాయి. అవి మ్యాథ‌మేటిక్స్‌(200 మార్కులు), జ‌న‌ర‌ల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్‌ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో క‌నీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి‌. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు చివ‌రిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయానికి పంపించాలి. 
ముఖ్యమైన తేదీలు:
* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30-09-2024.
* ప‌రీక్ష తేది: 01-12-2024.

ముఖ్యాంశాలు:
* ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(RIMC)లో 8వ త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు ప్రకటన వెలువడింది. 
* తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ స్టేట్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TGPSC) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
* రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

Notification

Official Website    
 

Published at : 27-07-2024 18:44:19

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :