• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TS POLYCET: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్‌లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యార్థులు జ‌న‌వ‌రి 16 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.  

కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్స్‌/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్‌ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా.

వివరాలు:

తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 

పరీక్ష ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16-01-2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 24-04-2023.

ఆలస్య రుసుము రూ.100తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25-04-2023.

పరీక్ష నిర్వహణ తేదీ: 17-05-2023.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 12-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :