• facebook
  • twitter
  • whatsapp
  • telegram

WCR: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2226 అప్రెంటిస్‌లు 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన జబల్‌పూర్‌ ప్రధానకేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) 2021-2022 సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* యాక్ట్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 2226

ట్రేడులు: డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, వైర్‌మెన్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: 50% మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: 01.01.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021.

దరఖాస్తులకి చివరి తేది: 10.11.2021.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అది... జవాబులో తొలి భాగం!

‣ సర్కారీ కొలువు సాధ్యం ఇలా!

Notification Information

Posted Date: 08-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :