• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PGT, TGT Posts: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. టీజీటీ 71, పీజీటీ 211 పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు.

వివరాలు...

1. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): 71 పోస్టులు

2. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): 211 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీలు: టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా, పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124. 

మొత్తం ఖాళీల సంఖ్య: 282

అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టు్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ వారికి 49 ఏళ్లు. 

ఎంపిక విధానం: జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.  డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20శాతం, టీచింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగ‌స్టు 17.

ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా ప్రకటన: ఆగస్టు 23 

అభ్యంతరాల స్వీకరణ తేదీలు: ఆగస్టు 24 - 25 

ఇంటర్వ్యూ జాబితా విడుదల: ఆగస్టు 29 

వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణ: నవంబరు 8 

ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్‌ తేది: నవంబరు 9

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వసివాడుతున్న బాల్యం

‣ మొబైల్‌ యాప్‌ డెవలపర్లకు డిమాండ్‌!

‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 16-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :