• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APSFC: ఏపీఎస్‌ఎఫ్‌సీలో 23 మేనేజర్లు, ఇతర ఖాళీలు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 23

1) మేనేజర్లు (ఫైనాన్స్‌): 09

2) డిప్యూటీ మేనేజర్లు (ఫైనాన్స్‌): 03

3) అసిస్టెంట్‌ మేనేజర్లు (ఫైనాన్స్, లా): 11

అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ/ బీటెక్‌తో పాటు ఎంబీఏ/ పీజీడీఎం, బ్యాచిలర్‌/ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లా ఇన్‌ బిజినెస్‌/ కమర్షియల్‌ లా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 01.08.2021 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఇంగ్లిష్‌ మాధ్యమంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ బీసీ అభ్యర్థులు రూ.1003, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.590 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.09.2021.

దరఖాస్తులకి చివరి తేది: 10.11.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఎన్‌బీసీసీలో అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు

బ‌డికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి

Notification Information

Posted Date: 08-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :