• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UPSC: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామ్‌-2024 

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో 506 అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష వివరాలు:

* సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024

ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌- 186, సీఆర్‌పీఎఫ్‌- 120, సీఐఎస్‌ఎఫ్‌- 100, ఐటీబీపీ- 58, ఎస్‌ఎస్‌బీ- 42.

మొత్తం పోస్టుల సంఖ్య: 506.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 14.05.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 15.05.2024 నుంచి 21.05.2024 వరకు.

రాత పరీక్ష తేదీ: 04-08-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :