• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Civil Judge: తెలంగాణలో 150 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులు 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని జూనియర్ విభాగంలో 150 మంది సివిల్ జడ్జీల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2024 సంవత్సరానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీల ద్వారా 15 ఖాళీలు; 2024, 2025 సంవత్సరాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) 90 ఖాళీలు, బదిలీల (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా 14 ఖాళీలు భర్తీ కానున్నాయి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (2024 సంవత్సరానికి): 31 పోస్టులు

2. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- బదిలీ ద్వారా భర్తీ (2024 సంవత్సరానికి): 15 పోస్టులు

3. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) (2024, 2025 సంవత్సరాలకు): 90 పోస్టులు

4. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- బదిలీ ద్వారా భర్తీ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) (2024, 2025 సంవత్సరాలకు): 14 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 150.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు కనిష్ఠంగా 23 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 35 ఏళ్లు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

జీత భత్యాలు: నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500).

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2024.

స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 08-06-2024.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 16-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :