• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు 

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం… కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), యాంట్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం సేవల్లో చేరతారు.

ప్రకటన వివరాలు:

1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

రీజియన్‌/ జోన్‌ వారీ ఖాళీలు: నార్త్‌- 77; వెస్ట్- 66; నార్త్ ఈస్ట్- 68; ఈస్ట్‌- 34; నార్త్ వెస్ట్- 12, అండమాన్ అండ్‌ నికోబార్- 03.

2. యాంట్రిక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు

అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌), యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01-03-2003 నుంచి 28-02-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు  వర్తిస్తుంది.

ప్రాథమిక వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-06-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.

పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్:

స్టేజ్-I: సెప్టెంబర్ 2024.

స్టేజ్-II: నవంబర్ 2024.

స్టేజ్-III: ఏప్రిల్ 2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :