• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు 

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

ప్రకటన వివరాలు:

1. కానిస్టేబుల్: 4,208 పోస్టులు

2. సబ్ ఇన్‌స్పెక్టర్: 452 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 4,660.

అర్హత: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం: 15-04-2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2024.

గమనిక: రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి. సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ మేగజీన్‌ (మార్చి 2- 8)లో చూడవచ్చు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్‌’ కోర్సులు

‣ ఎన్‌సీఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులు

‣ ‘సాయ్‌’లో కోచ్‌ కొలువులు

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ సైన్యంలో స్పెషల్‌ ఎంట్రీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :