• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SBI Recruitment: ఎస్‌బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్...  పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 22.09.2022 నుంచి 12.10.2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

ప్రొబేషనరీ ఆఫీసర్: 1673 పోస్టులు(ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌- 648)

ఖాళీలు: రెగ్యులర్- 1600; బ్యాక్‌లాగ్- 73.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి(01.04.2022 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2022, డిసెంబర్ మొదటి/ రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022, డిసెంబర్ 17/ 18/ 19/ 20.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2022/ జనవరి 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి 2023/ ఫిబ్రవరి 2023.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: జనవరి 2023/ ఫిబ్రవరి 2023.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 2023.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023.

ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: ఫిబ్రవరి/ మార్చి 2023.

తుది ఫలితాల ప్రకటన: మార్చి 2023.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

 

Notification Information

Posted Date: 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :