• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SBI: ఎస్‌బీఐలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్లు 

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)

మొత్తం ఖాళీలు: 2056 (రెగ్యులర్‌ పోస్టులు-2000, బ్యాక్‌లాగ్‌ పోస్టులు-56)

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది/ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌/ కాస్ట్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులే.

వయసు: 01.04.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు (గంట) ఉంటుంది. 

* ఈ పరీక్షలో సాధించిన అగ్రిగేట్‌ మార్కుల ఆధారంగా కేటగిరి వైజ్‌ మెరిట్‌ లిస్ట్‌ ఉంటుంది. సెక్షనల్‌ కటాఫ్‌ ఉండదు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెయిన్‌ ఎగ్జామ్‌కి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

* మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్టులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు, 200 మార్కులకి ఉంటాయి. 

* డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌) నుంచి  50 మార్కులకి ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది. 

* ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కోవిడ్‌ 19 నిబంధనలు పాటిస్తూ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూని మాత్రమే 50 మార్కులకి నిర్వహించవచ్చు లేదా 30 మార్కులకి ఇంటర్వ్యూ, 20 మార్కులకి గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.

ఫేజ్: 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌: నవంబరు/ డిసెంబరు 2021.

ఫేజ్‌: 2 ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌: డిసెంబరు 2021.

ఫేజ్‌: 3 ఇంటర్వ్యూ (ఇంటర్వ్యూ అండ్‌ గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌): 2022 ఫిబ్రవరి 2/ 3 వారం.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉపాధినిచ్చేలా విభిన్న బ్రాంచీల సమ్మేళనం

‣ సృజనకు చిరునామా... ఫైన్‌ ఆర్ట్స్‌

Notification Information

Posted Date: 04-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :