• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SOFTWARE Jobs: యాక్సెంచర్‌-హైదరాబాద్‌లో అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఖాళీలు 

హైదరాబాద్‌లోని యాక్సెంచర్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు.

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ (సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత.

* దూరవిద్య ద్వారా ఎంబీఏ/ పీజీడీఎం పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.

పని అనుభవం: 0-11 నెలలు ఉండాలి.

జీతభత్యాలు: ఏటా రూ.450000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

1. మాక్ అసెస్‌మెంట్: 20 నిమిషాల మాక్/ ప్రాక్టీస్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు సరైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ ఉందని నిర్ధారణకు వస్తారు.

2. కాగ్నిటివ్, టెక్నికల్ అసెస్‌మెంట్: ఇందులో 90 నిమిషాల సమయంలో 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అభ్యర్థుల ఇంగ్లీష్ సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పరిశీలిస్తారు. పరీక్షలో భాగంగా అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్, సూడోకోడ్, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 

3. కోడింగ్ అసెస్‌మెంట్

4. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్.

పని ప్రదేశాలు: బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, ముంబయి, చెన్నై, గురుగావ్‌, కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్‌: https://indiacampus.accenture.com/myzone/accenture/1/jobs/2211/job-details
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :