• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICAR: నేతాజీ సుభాష్‌ - ఐకార్‌ ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్స్‌

న్యూదిల్లీ(పూసా)లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌)కి చెందిన అగ్రికల్చరల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం 2021-2022 సంవత్సరానికి అర్హులైన ఇండియన్‌, ఫారిన్‌ అభ్యర్థుల నుంచి ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* నేతాజీ సుభాష్‌ - ఐకార్‌ ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్స్‌

ఫెలోషిప్‌ ఖాళీలు: 30

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో అగ్రికల్చర్‌/ అనుబంధ సైన్సుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఫెలోషిప్‌ మొత్తం: ఒకవేళ భారతదేశానికి చెందిన విద్యార్థులు విదేశాలకి వెళితే నెలకి 2000 యూఎస్‌ డాలర్లు, ఏడాదికి 1000 డాలర్ల చొప్పున కంటింజెంట్‌, ఇతర ఖర్చుల కింద చెల్లిస్తారు. విదేశాలకి చెందిన అభ్యర్థులు భారత్‌కి వస్తే నెలకి రూ.40000, కంటింజెంట్‌, ఇతర ఖర్చులకి ఏడాదికి రూ.25000 చొప్పున చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ రికార్డ్స్‌, సాధించిన విజయాలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈమెయిల్‌: nsicarif@gmail.com

దరఖాస్తులకి చివరి తేది: 31.10.2021.

చిరునామా: Principal Scientist (EQR), Agricultural Education Division, ICAR, Krishi Anusandhan Bhavan II, Pusa, New Delhi110012.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

 ‣ నీట్‌, జేఈఈలో విజయానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సరైన ఎంపిక (ప్రకటన)

 ‣ సీఎస్‌ఐఆర్‌-టీకేడీఎల్‌లో 64 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

 ‣ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు 

 

 

Notification Information

Posted Date: 08-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :