• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌లో తెలుగోళ్ల హవా

* దేశవ్యాప్తంగా 23 మందికి 100 పర్సంటైల్‌

* తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 23 మంది 100 పర్సంటైల్‌ సాధించగా, వారిలో 10మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే కావడం విశేషం. పేపర్‌-1 పర్సంటైల్‌ (ఎన్‌టీఏ స్కోర్‌)ను జాతీయ పరీక్షల సంస్థ ఫిబ్రవరి 13న ఉదయం వెల్లడించింది. ఎన్‌ఐటీల్లో బీటెక్‌లో ప్రవేశాలకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కోసం జేఈఈ మెయిన్‌ పేపర్‌-1ను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 11.70 లక్షల మంది పరీక్షలు రాయగా, తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది హాజరయ్యారు. 100 పర్సంటైల్‌ దక్కించుకున్న వారిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు ఉండగా, ఏపీనుంచి ముగ్గురు ఉన్నారు. వీరిలో జనవరి 27న ఉదయం పరీక్ష రాసినవారే ఎక్కువ మంది ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం విడత పరీక్ష సులభంగా ఉండటమే ఇందుకు కారణమని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ అభిప్రాయపడ్డారు. ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు జనరల్‌ విభాగం విద్యార్థులకు 90 పర్సంటైల్‌ వరకు ఉండొచ్చని ఆయన అంచనా. ఏప్రిల్‌లో జరిగే చివరి విడత జేఈఈ మెయిన్‌ తర్వాత రెండింటిలో వచ్చే ఉత్తమ పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని (రెండుసార్లు పరీక్షలు రాస్తే) ర్యాంకులు కేటాయిస్తారు.

 



100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు

తెలంగాణ నుంచి: రిషిశేఖర్‌ శుక్లా, రోషన్‌సాయి పబ్బా, ముత్తవరపు అనూప్‌, హుందేకర్‌ విదిత్‌, వెంకటసాయితేజ మాదినేని, మోహన్‌ కల్లూరి, తవ్వా దినేశ్‌రెడ్డి

ఏపీ నుంచి: షేక్‌ సూరజ్‌, తోటా సాయికార్తీక్‌, అన్నారెడ్డి వెంకటతనీష్‌రెడ్డి


కేటగిరీల వారీగా జాతీయ స్థాయిలో తెలుగు టాపర్లు

తెలంగాణ నుంచి: శ్రీసూర్యవర్మ దాట(99.99), దొరిశాల శ్రీనివాసరెడ్డి(99.99). వీరిద్దరు ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ.

జగన్నాథం మోహిత్‌(99.99)- ఎస్టీ విభాగం

చుంచికల శ్రీచరణ్‌(99.98)- దివ్యాంగుల విభాగం

ఏపీ నుంచి: షేక్‌ సూరజ్‌(100)- ఓబీసీ
 

 

 

 

 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్టుగార్డులో 260 నావిక్‌ ఉద్యోగాలు

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 14-02-2024


 

ప్రవేశ పరీక్షలు