• facebook
  • whatsapp
  • telegram

నిలకడ చూపితే.. గెలుపు నీదే!

* సీఎంఏ టాపర్‌ గురుభాస్కర్‌రెడ్డి సక్సెస్‌ మంత్ర

అఖిల భారత స్థాయిలో ప్రథముడిగా రావాలంటే... మామూలు కృషి సరిపోదు. పేదరికం అతడికి కష్టపడటం నేర్పించింది. త్వరగా స్థిరపడి తల్లిదండ్రుల భారాన్ని తగ్గించాలనే తపన అతడికి స్ఫూర్తినిచ్చింది. ఎంచుకున్న కోర్సును ఏకాగ్రతతో చదివాడు. సబ్జెక్టును ఆకళింపు చేసుకున్నాడు. సీఎంఏ ఫైనల్లో ఏకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా ప్రొద్దుటూరు విద్యార్థి గురుభాస్కర్‌రెడ్డి గెలుపు ప్రస్థానమిది! తన ర్యాంకుకు దోహదపడిన అంశాల గురించి ‘ చదువు’తో ఇలా పంచుకున్నాడు!

నేను సీఎంఏ, సీఏ కోర్సుల్లో చేరటానికి మా తల్లిదండ్రులే ప్రేరణ. దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న గురుశేఖర్‌రెడ్డి కూరగాయల మార్కెట్లో మూటలు మోసే హమాలీ. అమ్మ రేణుకాదేవి గృహిణి. వీరు ఏమీ చదువుకోలేదు. నా చదువుకు మాత్రమే కాకుండా మా చెల్లెళ్ల చదువులకూ అమ్మానాన్నా చాలా కష్టపడ్డారు. కొన్ని సందర్భాల్లో వారి పనిలో సాయంగా ఉండేవాణ్ణి. ఈ పరిస్థితులు నా దృక్పథాన్ని మార్చేశాయి. కష్టపడి చదివి, వీలైనంత త్వరగా అమ్మానాన్నలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనీ నిర్ణయించుకున్నా.

పదో తరగతి పూర్తిచేశాక ‘తక్కువ ఖర్చుతో పూర్తిచేయగల కోర్సు ఏది?’ అని తెలిసిన వారందరినీ అడిగాను. ‘సి.ఎ./ సి.ఎం.ఎ. కోర్సులైతే తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్ఛు కొద్దికాలంలోనే మంచి ఉద్యోగం, సమాజంలో మంచి హోదా సంపాదించవచ్చు’ అని వారు చెప్పారు. స్కూలు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించారు.

కామర్స్‌పై మంచి పునాది ఏర్పడుతుందని ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకున్నాను. ఇంటర్‌తో పాటు సీిఏ-సీపీటీ సమాంతరంగా పూర్తిచేశాను. ఆపై సీఏ- ఇంటర్‌ పూర్తిచేశాను. విద్యార్థులు సీఏ ఇంటర్లో అర్హత పొందాక మూడు సంవత్సరాల శిక్షణ తీసుకోవాల్సివుంటుంది. ఈ ఆర్టికల్‌ షిప్‌ సమయంలోనే సీఏతో పాటు ఇదే తరహా కోర్సు చేయొచ్చనీ, భవిష్యత్తు బాగుంటుందనీ తెలిసింది. స్వల్ప తేడాతో సీఏ, సీఎంఏ సబ్జెక్టులు దాదాపు ఒకటే కాబట్టి సీఎంఏను చదవటం మొదలుపెట్టా. పైగా నాకు చాలా ఇష్టమైన ‘కాస్టింగ్‌’.. సీఎంఏలో కోర్‌ సబ్జెక్టు. సీఎంఏను ఎంచుకోవటానికి ఇవీ కారణాలు.

ఏం చదవాలి, ఎలా చదవాలి అనే విషయంలో ప్రణాళికాబద్ధంగా శిక్షణ తీసుకున్నాను. సీఎంఏ ఇంటర్‌లో ఆలిండియా 5వ ర్యాంకు, ఇప్పుడు సీఎంఏ ఫైనల్‌లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించాను. ఈ వరుస విజయాలకి నాకు శిక్షణ ఇచ్చిన సంస్థ, అమ్మానాన్నలే కారణం.

సంపూర్ణంగా పునశ్చరణ
ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు. చదివినంతసేపు ఎంత బాగా చదివామనేదే ముఖ్యం. రకరకాల రచయితల పుస్తకాలు చదవడం వల్ల అనవసర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మొదటి నుంచీ ఏదో ఒక మెటీరియల్‌/బుక్‌ కి పరిమితం అయి చదివితే మంచిది.
* సన్నద్ధత సమయంలో ప్రతి అంశానికీ ప్రాముఖ్యం ఇవ్వాలి. అన్ని అంశాలూ పునశ్చరణ సమయంలో చెయ్యగలిగారా లేదో చూసుకోవాలి.
* పకడ్బందీ ప్రణాళిక, నిలకడైన సన్నద్ధత, తగిన మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా సరే, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. కాన్సెప్టులపై సులభంగా స్పష్టత రావటానికి కోచింగ్‌ చాలా ఉపయోగపడుతుంది.
* పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు చదవాలి. పరీక్ష లోపు ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకుంటే మంచి ఫలితముంటుంది.

అంత కష్టం కాదు
* సీఎంఏ కోర్సును పూర్తిచేయటం చాలా కష్టమనే భావన ప్రచారంలో ఉంది. ఇది అందరూ అనుకునేంత కష్టం కాదు. తగినంత సమయంకేటాయించి సరైన పఠన ప్రణాళికతో స్మార్ట్‌ వర్క్‌ చేస్తే ఏ ప్రొఫెషనల్‌ కోర్సు అయినా కష్టం కాదు. సన్నద్ధతను నిలకడగా కొనసాగించగలిగితే సీఎంఏలో మంచి స్కోరు సాధ్యమే.
* కొంచెం కష్టమనిపించిన సబ్జెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి చదివేవాణ్ణి. ఎప్పుడైనా నమ్మకం సన్నగిల్లినప్పుడు ఇంట్లో వాళ్లతో మాట్లాడేవాడిని. అప్పుడు వెంటనే ఉత్సాహంగా అనిపించేది. పరీక్ష ఇంకో నెలరోజులు ఉందనగా ఎక్కువ కష్టపడటం మొదలు పెట్టాను. పరీక్ష పూర్తయ్యేవరకూ అనవసర విషయాలకు దూరంగా ఉండి చదివాను.

Posted Date: 09-03-2020