• facebook
  • whatsapp
  • telegram

మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయాలి

* పాలీసెట్ ఏడో ర్యాంకర్ రామ్ చరణ్ రాయ్
సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేటకు చెందిన పేర్నీడి వీవీఎస్ఎస్ రామ్‌చరణ్ రాయ్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలీసెట్-2014)లో రాష్ట్ర స్థాయి ఏడో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ర్యాంకు సాధనలో రాయ్ చేసిన కృషిపై 'న్యూస్‌టుడే పలకరించగా తన మాటల్లోనే ఆ వివరాలను వెల్లడించాడు.

పాలీసెట్ 2014లో రాష్ట్ర స్థాయి ఏడో ర్యాకు సాధించడం ఆనందంగా ఉంది. 120 మార్కులకు గాను 117 మార్కులు వచ్చాయి. మాది సాధారణ మధ్యతరగతి కుంటుంబం. నా ప్రాథమిక విద్య కాకినాడలోని న్యూసెంచురీ పాఠశాలలో, ఉన్నత విద్య ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్‌లో చదివాను. పదో తరగతిలో 9.8 పాయింట్లు సాధించాను.
ఇటీవల విడుదల చేసిన ఏపీఆర్‌జేసీ పోటీ పరీక్షలోనూ రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సంపాదించాను. నేను సాధించిన విజయాల వెనక మా పాఠశాల ప్రిన్సిపాల్ మొయినా మేడమ్, నాన్న వెంకన్నబాబు తోడ్పాటు ఎంతో ఉంది.
పాఠశాల సమయం తరువాత దాదాపు 4 గంటలు చదివేవాడిని. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణా తీసుకోలేదు. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పట్టు వచ్చేలా పాఠశాల ఉపాధ్యాయులు సహకరించారు. వారి చెప్పిందే కాకుండా, ఇతర సమాచారాన్ని అంతర్జాలంనుంచి సేకరించాను. పాత, మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయోగపడింది. ఇంజినీర్ కావాలనేదే నా లక్ష్యం.

Posted Date: 01-11-2019