• facebook
  • whatsapp
  • telegram

నిరంతరం చదవాలి!

* ఎడ్‌సెట్- 2014 ఇంగ్లిష్ టాపర్ శామ్యూల్.

డిఫెన్స్ కాలనీ (సికింద్రాబాద్), న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రతి రోజూ చదవాల్సిందేనంటున్నారు సి.శామ్యూల్. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ -2014లో ఆగ్లంలో 111మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాదించిన శామ్యూల్‌ను న్యూస్‌టుడే పలుకరించింది. ఆ వివరాలు...

ప్ర: కుంటుంబ వివరాలు చెప్పండి?
శామ్యూల్: నాన్న పేరు ఎ. క్రిష్టి, హెచ్‌బీఎల్‌లో డిజీఎంగా రిటైర్ అయ్యారు. అమ్మ బ్యూలా క్రిష్టి గృహిణి. ముగ్గురు అక్కలు శారన్, శుల, స్మిర్‌నాలు. వీరు పీజీ పూర్తి చేసి ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇద్దరు సోదరులు. బల్‌మర్ లారీ(సెంట్రల్ గవర్నమెంట్) ఉద్యోగి. శాలిన్ డిగ్రీ చదువుతున్నాడు.

ప్ర: మీ విద్యార్హతల వివరాలు...
శామ్యూల్: సెంట్ జోసెఫ్ హైస్కుల్, తిరుమలగిరిలో మొదటి తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివాను. పదో తరగతిలో 353 మర్కులు వచ్చాయి. ఇంటర్ వెస్లీ జూనియర్ కాలేజ్, ప్యారడైజ్‌లో చదివాను. 56శాతం మార్కులు వచ్చాయి. తర్వాత డిగ్రీ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేశాను 53శాతం వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ ఇంగ్లీష్‌లో 63 శాతం ఉత్తీర్ణత సాధించాను.

ప్ర: టీచర్ వృత్తి వైపు ఎందుకు వెళ్లాలనుకున్నారు?
శామ్యూల్: టీచింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపు వెళ్లాలనుకుంటున్నాను. నాకు తెలిసినది నలుగురికి అర్థమైనట్లు చెప్పడం ఇష్టం. ప్రస్తుతం ఓ ప్రవేటు కళాశాలలో పనిచేస్తున్నాను. నా ఆసక్తిని గమనించి నా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు.

ప్ర: ఎడ్‌సెట్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు?
శామ్యూల్: నిరంతరం సబ్జెక్ట్ తో టచ్‌లో ఉండేవాడిని. మొదటి నుంచి ఇంగ్లీష్ మిడియం కాబట్టి ఆంగ్లంపై మంచి పట్టు ఉంది. ఎక్కువగా ఇంగ్లీష్ నవలలు, చరిత్ర, కామెంట్రీ బుక్స్ చదువుతాను. ఇక ఇంగ్లిష్ లిటరేచర్ విషయానికొస్తే ఇంగ్లిష్ లిటరేచర్‌కు బైబిల్‌కు చాలా పోలికలు ఉన్నాయి. బైబిల్‌లో నుంచి తీసిన క్యారెక్టర్స్ ఇంగ్లిష్ లిటిరేచర్‌లో ఉంటాయి కాబట్టి అది నాకు చాలా ఉపయోగపడింది.
* ఒక గంట చదివితే 10నిమిషాలు విరామం ఇచ్చేవాడిని. సిలబస్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఇంటర్‌నెట్ ద్వారా అప్‌డేట్ చేసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యాను.

ప్ర: ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకున్నారా?
శామ్యూల్: లేదు. ఇంటర్‌నెట్ ద్వారానే పూర్తి సమాచారం తీసుకున్నాను.

ప్ర: కొత్తవారికి మీరు ఇచ్చే సలహా.
శామ్యూల్: సబ్జెక్ట్ ను విభజించి దాని ప్రకారం పరీక్షకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఏ రంగాన్ని అయినా ఎంచుకునే ముందు ఇష్టం ఉందో లేదో గమనించాలి. ఆ విధంగా చేస్తే కష్టంగా ఉండదని నా అభిప్రాయం.

Posted Date: 02-11-2019