• facebook
  • whatsapp
  • telegram

బాధ్యతలు తీసుకోవాలనే...

- జుహీ

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో! దాని పొందే పద్ధతుల విషయంలోనూ అంతే పక్కాగా ఉండాలి. అందుకే లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత దాన్నే లోకంగా మార్చేసుకుంటా. ప్రస్తుతం నేను పెట్టుకున్న లక్ష్యం క్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడం. మంచి కాలేజీలో మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయడం. దానిలో మొదటి లక్ష్యం జాతీయ స్థాయి పరీక్ష కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2018 ఫలితాల్లో 98.97 పర్సంటైల్‌తో అందుకున్నందుకు సంతోషంగా ఉంది. మాది హైదరాబాద్‌. నేను ఇప్పటికే బీఆర్క్‌ పూర్తిచేశాను. నాన్న సునీల్‌ కుమార్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌. ఆయనకు సొంతంగా ఓ సంస్థ ఉంది. అమ్మ కృష్ణశ్రీ గృహిణి. మొదటి నుంచీ నాకు కళలంటే అంటే ప్రత్యేక శ్రద్ధ. అందుకే కెరీర్‌గా బీఆర్క్‌ని ఎంచుకున్నా. అందుకోసం ‘స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌’ భోపాల్‌లో సీటు సంపాదించి చేరిపోయా. చదువయ్యాక హైదరాబాద్‌ వచ్చి నాన్న సంస్థలోనే ఉద్యోగంలో చేరా. చదువుకునేటప్పుడు వివిధ ఫెస్ట్‌ల నిర్వహణలో కీలకంగా పనిచేశా. స్పాన్సర్లను ఒప్పించడం, మానవవనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం వంటివన్నీ...మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలపై నాకు ఆసక్తిని కలిగించాయి. దానికి తోడు హైదరాబాద్‌ వచ్చాక ‘యువత’ అనే ఎన్‌జీవోలో డైరెక్టర్‌గా చేరా. సుమారు ఆరు అనాథాశ్రమాల బాధ్యతల్ని తీసుకున్నా. ఈ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఎంత అవసరమో అర్థమయ్యింది. మరోపక్క నాన్న సంస్థలోకి వచ్చాక సంస్థ మేనేజ్‌మెంట్‌ అంశాలపై అవగాహన, దానితో పాటే ఆసక్తీ పెరిగాయి. అలా ఎంబీఏ (మార్కెటింగ్‌) చేయాలనే లక్ష్యం ఏర్పడింది. అయితే అది మామూలుగా ఏదో ఒక కాలేజీలో కాకుండా, అంతా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐఎమ్‌లో చదవాలనుకున్నా.

మాక్‌ టెస్ట్‌లు రాస్తూ...
అనుకున్నదే తడవుగా సాధన మొదలుపెట్టా. తక్కువ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే క్యాట్‌లో ఈ స్కోర్‌ సాధ్యమైంది. దీనిలోని మూడు విభాగాల్లో వెర్బల్‌ టెస్ట్‌ విషయంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ ఆంగ్లంపై పట్టు ఉంది. అలాని అదొక్కటే సరిపోదు. లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటివాటిపైనా పూర్తిస్థాయి అవగాహన అవసరం. అందుకోసం కొన్నాళ్లు కోచింగ్‌ తీసుకున్నా. ఓ పక్కన ఉద్యోగం చేస్తూనే చదవడం మొదలుపెట్టా. రోజూ మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు రాసేదాన్ని. దాంతో ఏ సమయాన్ని దేనికి కేటాయించుకోవాలో? ఎంత వేగంగా పూర్తిచేయగలుగుతున్నానో వంటివన్నీ తెలిశాయి. ఇలా రోజు మొత్తంలో ఐదారు గంటల సమయాన్ని చదువుకోసం కేటాయించేదాన్ని. నిజానికి నా ఉద్దేశంలో చదువుని బట్టీ పట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని ఇష్టంతోనే చదవాలి. అలాని చదువంటే ...పుస్తకాలకే పరిమితం కాదనేది నా అభిప్రాయం. అందుకే ఆంగ్ల నవలలు, వార్తాపత్రికలు క్రమం తప్పకుండా చదువుతా. ఇవన్నీ పదసంపద, పరిజ్ఞానం పెంచాయి. క్యాట్‌ ఫలితాల్లో వెర్బల్‌లో 99 పర్సంటైల్‌ సాధించా. మొత్తం 98.97 పర్సంటైల్‌తో మంచి కాలేజీలో సీటు సంపాదించుకునే అర్హత అందుకున్నా.

Posted Date: 02-11-2019