• facebook
  • whatsapp
  • telegram

సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి!

* ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఏ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై గట్టి అవగాహన ఉండాలని ఈసెట్ 2014 రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ అయ్యప్ప అన్నారు. మే 2014లో ప్రకటించిన ఈసెట్ ఫలితాల్లో అయ్యప్ప రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించారు.ఈ సందర్భంగా ఆయనను న్యూస్‌టుడే పలకరించింది.

ఆ విశేషాలు...

ఒంగోలులోని వెంకటేశ్వరా నగర్‌లో నివాసం ఉంటున్న వెలనాటి రామయ్య కుమారుడు అయ్యప్ప పేదరికాన్ని అధిగమించి స్వశక్తితో ఈసెట్ 2014లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. తండ్రి రామయ్య ఉడ్ కాంప్లెక్స్‌లో రిక్షా కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కుమారుడు అయ్యప్ప ఒక్కరే ఉన్నత చదువులకు వెళ్లారు.
అయప్ప ఒంగోలులోని ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తరువాత విజయవాడలోని పి.బి.సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్‌లో చేరారు. తాను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులను అధిగమించటం కోసం మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు అదే కళాశాలలో మ్యాథ్స్ కేర్‌టేకర్‌గా పనిచేశారు. తద్వారా నెలకు రూ.వెయ్యి లభించేది. సాయంత్రం 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు హోమ్ ట్యూషన్ చేప్పేవారు. దీని ద్వారా వచ్చిన డబ్బుతో చక్కగా చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. బీటెక్ చేయాలనే సంకల్పంతో ఇటీవల ఈసెట్ ఎంట్రన్స్‌రాసి అత్యధిక మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. 200లకు 112 మార్కులు కైవసం చేసుకున్నారు.

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నా లక్ష్యం
అయ్యప్ప 'న్యూస్‌టుడేతో మాట్లాడుతూ భవిష్యత్తులో బీటెక్‌లో సీఎస్ఈ తీసుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపారు. 20 రోజులపాటు ప్రణాళికా బద్ధంగా చదవడం వల్లే ఈసెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగలిగానన్నారు. రోజుకు నాలుగు గంటలపాటు గణితం, రీజినింగ్ సబ్జెక్టులపై దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రతిరోజు గ్రంథాలయంలో ఒక గంటపాటు సబ్జెక్టు పుస్తకాలను చదువుకున్నట్లు తెలిపారు. మూడున్నర నెలలపాటు ఇంగ్లీష్ కోచింగ్ తీసుకున్నానని, తన విజయానికి అది ఎంతగానో ఉపయోగపడిందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారని, వారిని భవిష్యత్తులో సుఖపెట్టటమే తన జీవితాశయం అన్నారు. ఈసెట్ రాయబోయే విద్యార్థులు ఎవరైనా బేసిక్ నాలెడ్జి సంపాదించాలన్నారు. ఆరు నుంచి 10వ తరగతి వరకు గణితం పుస్తకాలను రివైజ్ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

Posted Date: 02-11-2019