Post your question

 

    Asked By: సుభద్ర

    Ans:

    ఉద్యోగస్తులు గ్రూప్‌-1 దరఖాస్తుకు ముందు ఒకసారి మీ పై అధికారికి సూచిస్తే సరిపోతుంది. వెరిఫికేషన్‌ సమయంలో ఆయన సంతకం చేసిన ఎన్‌ఓసీని సమర్పించాలి.

    Asked By: సాగర్

    Ans:

    దూరవిద్యలో డిగ్రీని ఎక్కడి నుంచైనా చేయవచ్చు. ఓటీఆర్‌లో తహసీల్దారు సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. మీరు నిస్సందేహంగా టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: శ్రీను

    Ans:

    ఓటీఆర్‌ నింపేటప్పుడు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న కాలమ్‌లో ప్రైవేట్‌ అని పూర్తిచేసి, ఆ కాలానికి సంబంధించి తహసీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని జత చేయండి

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    జనరల్‌ స్టడీస్‌ కామన్‌గా ఉంటుంది. సబ్జెక్ట్‌ విషయానికి వస్తే పాలిటెక్నిక్‌ ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌) పుస్తకాలను బాగా చదవండి. వీటికి సంబంధించిన బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించండి.

    Asked By: చంద్రలేఖ కుంచం

    Ans:

    ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ తప్పులను సరిదిద్దడానికే ఉంటుంది. నెట్‌వర్క్‌ సరిగా లేకపోయినా ఒక్కోసారి అప్‌డేట్‌ కాదు. మరొకసారి ప్రయత్నించి చూడండి. అప్పటికీ కాకపోతే సర్వీస్‌ కమిషన్‌ను సంప్రదించండి.

    Asked By: రవితేజ గోషిక

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ తప్పనిసరిగా చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌లోనూ ఆర్థిక సంబంధ ప్రశ్నలు వస్తాయి. అయితే గ్రూప్‌-1, గ్రూప్‌-2 మెయిన్స్‌లో ఎకానమీకి ఉన్నంత వెయిటేజీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఉండదు.