Post your question

 

    Asked By: ఇఖిల్

    Ans:

    కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. మీరు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు నిజామాబాద్‌లో చదివారు కాబట్టి ఆ జిల్లా స్థానికతనే పొందుతారు.

    Asked By: ఎం.పార్థసారథి నాయుడు

    Ans:

    ఇంటర్‌ చదివిన తరువాత త్వరగా ఉద్యోగం సంపాదించాలంటే ప్రాచుర్యమున్న ఏదో ఒక కోర్సులో డిగ్రీ/ ఒకేషనల్‌ డిగ్రీ చేయాలి. ఉదాహరణకు- హోటల్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ సైన్స్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్, రిటెయిలింగ్, ఈ-కామర్స్, డిజిటల్‌ మార్కెటింగ్, కోడింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, రెఫ్రిజరేషన్, ఏర్‌కండిషనింగ్, ఫారిన్‌ ట్రేడ్, యానిమేషన్, మల్టీమీడియా, విజువల్‌ ఆర్ట్స్, మాస్‌ కమ్యూనికేషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, వెబ్‌ డిజైనింగ్, ఇంటీరియర్‌ డిజైన్‌. మీకు బోధనరంగంపై ఆసక్తి ఉంటే డీ…ఈడీ చేసే అవకాశం ఉంది. లాయర్‌గా స్థిరపడే ఆలోచన ఉంటే ఐదు సంవత్సరాల లా కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేసినవారికీ డిమాండ్‌ ఉంది. పైన చెప్పిన కోర్సుల్లో ఆసక్తి ఉన్న కోర్సును చదివి, త్వరగా ఉద్యోగం సంపాదించాలనే మీ కల నిజం చేసుకోండి! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Dheekshith Kumar

    Ans:

    గ్రూప్‌-1కి దరఖాస్తు చేసుకునే ముందు ప్రస్తుతం మీరు పని చేస్తున్న శాఖాధికారికి తెలియజేయాలి. ఎన్‌ఓసీని వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

    Asked By: రామకృష్ణ

    Ans:

    ఎంటెక్‌ కోర్సు దూరవిద్యలో చేయడానికి అవకాశం లేదు. మీరు ఎంటెక్‌ కోర్సుని రెగ్యులర్‌గా చదవాలనుకొంటే రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, మంచి విద్యాసంస్థలో చదివే ప్రయత్నం చేయండి. అతి తక్కువ యూనివర్సిటీల్లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో క్లాసులు సాయంత్రం పూట నిర్వహిస్తారు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎం టెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జ్యోతి కిషోర్

    Ans:

    ఓటీఆర్‌లో వివరాలు నింపేటప్పుడు ప్రైవేట్‌ అని కాలమ్‌లో పూర్తి చేయండి.

    Asked By: కార్తీక్

    Ans:

    ప్రస్తుత సంవత్సరానికి అవకాశం ఉండదు. నోటిఫికేషన్‌ వచ్చేనాటికి పాసై సర్టిఫికెట్‌ చేతిలో ఉంటే రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.