• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

2022-23 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స‌ర్వేను ఆర్థిక‌శాఖ‌ తాజా నివేదిక వెల్లడించింది.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 46 శాతం మందికి ఉపాధి
తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఉపాధి, ఇతర అంశాలపై అధ్యయన వివరాలను ఈ నివేదికలో వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమేపీ పెరిగి.. 2021-22 నాటికి 1.5 కోట్లకు చేరింది. వీరిలో అత్యధికంగా 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు, అనుబంధ వృత్తులు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం తదితర రంగాల్లో వారు పనిచేస్తున్నారు. తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది. ఔషధ, ఇంధన, రసాయన, జౌళి, తయారీ పరిశ్రమల్లో 11 శాతం.. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఆతిథ్యం, ఇతర వాణిజ్య, సేవా రంగాల్లో 11 శాతం మంది ఉన్నారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9 శాతం మంది చొప్పున పనిచేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

Posted Date: 07-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం