• facebook
  • whatsapp
  • telegram

10th Exams: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు


 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు మార్చి 15న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 5 నిమిషాల వరకూ ఆలస్యంగా వచ్చినా అవకాశం కల్పిస్తామన్నారు. విద్యార్థులంతా ఒకటి, రెండు రోజుల ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. పరీక్షల్లో ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే వారిని మిగిలిన పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని.. ఉపాధ్యాయులు, సిబ్బంది పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


పరీక్షా కేంద్రాలకు సంబంధించి 2,676 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ టీవీల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే డీఈవోలు పాఠశాలల హెడ్మాస్టర్ల ద్వారా విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. ఎవరైనా అందని వారుంటే వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షల సందర్భంగా డైరెక్టరేట్‌లో, డీఈవో కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు జరిగే సమయంలో వాటికి సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేస్తారు. విద్యార్థులు, పరీక్షల సిబ్బంది ఎవరూ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లడం నిషేధం.

విద్యార్థులు హాల్‌టికెట్‌, ప్యాడ్‌, పెన్‌, పెన్సిల్‌, స్కేలు, షార్ప్‌నర్‌, ఎరేజర్‌, జామెట్రీ పరికరాలు మాత్రమే తీసుకుని వెళ్లాలి. పరీక్ష ముగిసేవరకు విద్యార్థులు, సిబ్బంది బయటకు వెళ్లరాదు.


=========================================================

 ఇంటర్మీడియట్, పదో తరగతి మోడల్ పేపర్లు - 2024

 టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023-24

 తొమ్మిదో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేపర్లు

 ఎనిమిదో తరగతి  మోడ‌ల్ పేపర్లు

తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.