* ఏప్రిల్ 15న ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశ కౌన్సెలింగ్‌కు సంబంధించి రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 10) విడుదలయ్యాయి. సీట్ల కేటాయింపు ఫలితాలు అధికారిక కౌన్సెలింగ్ (Counselling) వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో వివరాలు నమోదు చేసుకున్న విద్యార్థులు యూజర్ పేరు, పాస్‌వర్డ్‌తో సీట్ అలాట్మెంట్ తెలుసుకోవచ్చు. సీటు పొందిన విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా సంబంధిత పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 15న; డాక్యుమెంటేషన్(Documentation), ఫీజు చెల్లింపు చివరి తేదీ ఏప్రిల్ 27గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తోంది.
సైనిక పాఠశాలల్లో రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.