• facebook
  • whatsapp
  • telegram

Allen Scholarship: అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్టు-2024

* మార్చి 24, 31 తేదీల్లో పరీక్షలు


ఈనాడు ప్రతిభ డెస్క్: కోటా (రాజస్థాన్)లోని అలెన్ కెరియర్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రాబోయే విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో చేరే విద్యార్థుల కోసం ఉపకార వేతనాలను అందిస్తోంది. మార్చి 27న ప్రారంభం కాబోయే బ్యాచ్‌కి అలెన్ స్కాలర్‌షిప్‌ అడ్మిషన్ టెస్ట్ 2024 (ASAT)ను దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 24న నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ డాక్టర్ బ్రజేష్ మహేశ్వరి ఒక  ప్రకటనలో తెలిపారు. మరికొన్ని బ్యాచ్‌ల కోసం మార్చిన 31, ఏప్రిల్‌లో ఏశాట్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఉపకార వేతనాలను అందిస్తారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్ షిప్ లను 10 నుంచి 90 శాతం వరకు నిర్ణయించి, అందిస్తున్నట్లు డైరెక్టర్ వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

  అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.