* ఏపీలో మే 8న, తెలంగాణలో మే 6న పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)-2024 హాల్టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను ఏపీలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ- అనంతపురం నిర్వహిస్తుండగా, తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఏపీలో మే 8వ తేదీన, తెలంగాణలో మే 6న పరీక్ష జరుగనుంది.
ఏపీ ఈసెట్ 2024 హాల్టికెట్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఈసెట్ 2024 హాల్టికెట్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.