దిల్లీ: దేశవ్యాప్తంగా మే నెలలో నిర్వహించనున్న ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేయాలన్న అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మే నెలలో జరగాల్సిన పరీక్షలను జూన్‌కు వాయిదా వేయాలని 27 మంది విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. 4.26 లక్షల మంది విద్యార్థులు రాస్తున్న సీఏ(ఇంటర్మీడియెట్, ఫైనల్) పరీక్షలను కేవలం కొద్ది మంది అభ్యర్థన కోసం మార్చలేమని న్యాయమూర్తి జస్టిస్ సి.హరిశంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలకు సార్వత్రిక ఎన్నికల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని విచారణకు హాజరైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రతినిధి స్పష్టం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతినెలా స్టైపెండ్‌తో పరిశోధన కోర్సులు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.