• facebook
  • whatsapp
  • telegram

CA Inter Exams: సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల్లో మార్పు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం సీఏ ఇంటర్‌, గ్రూప్‌ 1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో; గ్రూప్‌ 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరగనున్నాయి. సీఏ ఫైనల్‌, గ్రూప్‌ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్ష మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐసీఏఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.  తాజా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. మెంబర్స్‌ ఎగ్జామినేషన్‌.. ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌-అసెస్‌మెంట్‌ పరీక్షను మే 14, 16 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు  ప్రతిష్ఠాత్మక ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) పరీక్షలను ఇకపై మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐసీఏఐ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ఏడాదికి మే/జూన్‌లో ఒకసారి,  నవంబర్‌/డిసెంబర్‌లో మరోసారి నిర్వహిస్తూ వస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ పరీక్షలను మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించారు. అభ్యర్థులు అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌ https://www.icai.org/ లో చెక్‌ చేసుకోవాలని సూచించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.