• facebook
  • whatsapp
  • telegram

CUET UG: సీయూఈటీ-యూజీ 2024 ప్రకటన విడుదల  

* మార్చి 26 దరఖాస్తుకు గడువు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ)- 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు. ప్రైవేట్, డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్ష జరుగనున్నాయి.

 

వెబ్‌సైట్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.