• facebook
  • whatsapp
  • telegram

DSC: డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: డీఎస్సీ 1998లో అర్హత పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 1998 క్వాలిఫైడ్స్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఈ డీఎస్సీలో ఉపాధ్యాయ నియామకాల్లో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు నియామకాలు ఇవ్వడకుండా అక్రమ మార్గాల్లో చేపట్టారని యూనియన్‌ అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ ఆరోపించారు. మార్చి 15న సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. నాటి నుంచి వరుసగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏపీలో 4567 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, తెలంగాణలో దాదాపు రెండువేల మంది అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు అబ్రహీం, టి.శ్రీనివాస్,  ఇషాక్‌ అలీ తదితరులు అధిక సంఖ్యలో ఉన్నారు. 


డీఎస్సీ తెలంగాణ


స్కూల్ అసిస్టెంట్


తెలుగు (కంటెంట్)

గణితం (కంటెంట్)

సోషల్ స్టడీస్ (కంటెంట్)



సెకండరీ గ్రేడ్ టీచర్స్

సైకాలజీ (కంటెంట్)

గణితం (కంటెంట్)

సైన్స్ (కంటెంట్)


తెలుగు పండిట్

కంటెంట్

మెథడాలజీ


బిట్ బ్యాంక్
 

ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)

బయాలజీ (కంటెంట్)

మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.