* నేదునూరుకు చెందిన గృహిణి ప్రతిభ
కందుకూరు, న్యూస్టుడే: ఈ కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించి శెభాష్ అనిపించుకుంది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన యువతి సయ్యదఅర్ఫా. ఎంఎస్సీ, బీఎడ్ పూర్తిచేసిన ఈమె.. ఇంటివద్దే ట్యూషన్స్ చెబుతూ కాలం గడుపుతోంది. ప్రభుత్వ టీచరైన ఆమె భర్త సల్మాన్ ప్రోత్సాహంతో పోటీపరీక్షలకు సన్నద్ధమైంది. గురుకుల నోటిఫికేషన్లలో భాగంగా 4 వేర్వేరు పరీక్షలు రాసింది. మూడు ఉద్యోగాలకు ఎంపికైంది. మరో ఉద్యోగానికి 1:2లో మెరిట్ సాధించింది. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో గణితం డిగ్రీ లెక్చరర్, గణితం జూనియర్ లెక్చరర్, పీజీటీ గణితం ఉద్యోగాలు సాధించింది. టీజీటీలో(1:2) ఎంపికైన తనకూ ఆ ఉద్యోగమూ ఖాయమంటోంది. పట్టుదలతో చదివితే ఏ కొలువైనా సాధ్యమని.. నిరుత్సాహ పడవద్దని నిరుద్యోగులకు ఆమె పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.