1. స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు
స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ ఆర్మాండ్ డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగిరిన డుప్లాంటిస్ గత సెప్టెంబరులో తన పేరిట నమోదైన రికార్డు (6.23 మీటర్లు)ను బద్దలు కొట్టాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళం
మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆఫీస్ మెమోరాండం విడుదలైంది. నాడీశాస్త్రంలో నిపుణులైన వారిని కార్యదళంలో సభ్యులుగా నియమించనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. భూతాప పరిమితికి ప్లాస్టిక్‌తో తూట్లు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతమున్న రీతిలోనే కొనసాగితే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన లారెన్స్ బెర్కలీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. దిల్లీలో నేర న్యాయ చట్టాలపై సదస్సు
‘నేర న్యాయ పాలనా వ్యవస్థలో భారతదేశ ప్రగతిశీల పథం’ అనే అంశంపై దిల్లీలో నిర్వహించిన సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా మన సమాజ అవసరాలు తీర్చేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా
ఓ భారీ క్షిపణి వార్‌హెడ్‌ను, విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. దేశ పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టారు. అమెరికా, దక్షిణ కొరియాలతో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో తన సైనిక పాటవాన్ని పెంపొందించుకునేందుకు ఉత్తర కొరియా ఇలాంటి ప్రయోగాలను నిర్వహిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.