• facebook
  • whatsapp
  • telegram

Polycet: 1 నుంచి పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు సోమవారం (ఏప్రిల్‌ 1) నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లోనూ ఏప్రిల్‌ 25 వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. పదోతరగతి పరీక్షలు రాసినవారు ఈ శిక్షణకు హాజరుకావొచ్చని, ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. చివరిరోజున ప్రీఫైనల్‌ ప్రవేశపరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఏప్రిల్‌ 5 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.